12, నవంబర్ 2012, సోమవారం

7, నవంబర్ 2012, బుధవారం

ఏమిటంటారు?

ఈ ముసిముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో ...

31, అక్టోబర్ 2012, బుధవారం

నీలమేఘశ్యాముని చేర

పుడమి పసిడి చీర కట్టి ముస్తాబైన వేళ..
Salt Lake City, Utah

7, అక్టోబర్ 2012, ఆదివారం

నీ చిరునవ్వు...

       దుఃఖ౦ నా మనసుకు ముసుగేసిందేమో...
       చీకట్లు ముసురుకున్నాయ్!
       వెలుతురు కోసం దీపాలమర్చాను
       వేయి దీపాలు చేయలేని పని...
       ఒక్క నీ చిరునవ్వుకే సాధ్యమని ఆలస్యంగా కనుగొన్నాను!


    న్యూజెర్సి 

26, సెప్టెంబర్ 2012, బుధవారం

అందమైన జీవితం

ముడుచుకున్న మొగ్గపై
చినుకుల చిరునగవులు చిందితే
ముసిముసి నవ్వుల పువ్వై విరిసింది!

నేడు కాసిని తుళ్ళింతల తరుణాలు ప్రోగుచేస్తే
రేపంతా ఇక పరిమళ భరితమే సుమా!


18, సెప్టెంబర్ 2012, మంగళవారం

ఔరా!

దాగని సిగ్గు మోముపై సింగారం ఒలికిస్తోంది, ఏ కన్నియ కలను దోచేశాయో!

23, ఆగస్టు 2012, గురువారం

ప్రియతమా

ఎద వాకిట యుగాలపాటు వేచియున్నాను 
నీవొచ్చే మధురక్షణాల కోసం!

అలసటతో రెప్పవాల్చుతానేమో నన్నుదాటి వెళ్ళిపోకు!
ఈ చిత్రపటానికి నీ స్పర్శతోనే జీవం!!


15, ఆగస్టు 2012, బుధవారం

విజయమో వీరస్వర్గమో

                                 తేల్చుకోవాలి గాని చిన్న సమస్యకే  వెన్ను చూపి పారిపోతే ఎలా...

13, ఆగస్టు 2012, సోమవారం

రాయికి సైతం రాగాలు నేర్పే జలతరంగిణి

                                                    వెన్నెల్లా కురిసింది వెల్లువై  పొంగింది
                                                    పరుగులెత్తే మదిని పట్టి బంధించింది!


     Nayagara Falls, NY

31, జులై 2012, మంగళవారం

ఏడేడు జన్మలూ..

మధురానుభూతిని పూరేకుగా మార్చి 
రేకులన్నీ ప్రోగుచేసి పూవుగా నమర్చి  
ఏడాది కాలాన్ని గుచ్చంగా అలంకరించి 
 ప్రేమగా అందించిన ఈ బహుమతికన్నా విలువైనదేదైనా వుంటుందా!
ఈ ప్రేమ పరిమళం మనసంతా ఆవరించగా ఏడేడు జన్మలూ నీవెంటే నేనడవనా..
24, జులై 2012, మంగళవారం

నీ సన్నిధిలో

                     ఈ పువ్వులు సైతం ఎలా నవ్వులు రువ్వుతున్నాయో చూడు...
మూడేళ్ళ నీరీక్షణ తరువాత మా పెరట్లో పూసిన సిరి మల్లెలు.

4, జులై 2012, బుధవారం

23, జూన్ 2012, శనివారం

నీవు లేని నేను లేను

 

          నేను లేక నీవు లేవు

         నేనే నువ్వు నువ్వే నేను
         నేను నువ్వు నువ్వు నేను లేనిచో ఈ జగమే లేదు...

19, జూన్ 2012, మంగళవారం

పలుకే బంగారమాయనా...

                 సూరీడు కడలి కబుర్లు చెప్పుకున్నట్లున్నారు.....

17, జూన్ 2012, ఆదివారం

14, జూన్ 2012, గురువారం

ఆరోగ్యానికి నడక

                    పత్రికలో ఈ వ్యాసం చదివినప్పటినుండీ ఎగరడం మాని నడవడం మొదలెట్టా...
Myrtle Beach, SC

10, జూన్ 2012, ఆదివారం

చుక్కల్లే తోచావే

                          ఎన్నెల్లే కాచావే...ఏడ బోయావే 

 Myrtle Beach SC


23, మే 2012, బుధవారం

చినుకుల సవ్వడిలో

               

నీలి మేఘం మెరుపుతీగతో సయ్యాటలాడే సమయాన
నా తలపులు నీ చెంతకు చేరి 
వలపుల జిలుగులు రువ్వుతున్నాయి చూడు!

11, మే 2012, శుక్రవారం

అందరాని చందమామ నాకె౦దుకూ

                                        వెన్నెల్లా౦టి ఈ పువ్వు చాలు నాకు 


6, మే 2012, ఆదివారం

ఆకాశవీధిలో అందాలజాబిలి


రఘునాధ్

గుండె కతలన్నీ గుట్టుగా, గుసగుసగా చెప్పలేనని,
కలంనడిగి నీలి అక్షరాలు తెచ్చా.
చిర్నవ్వు రేకులన్నీ నీపై చల్లలేనని, చిరుగాలి తెరలుతెచ్చా.
నిన్ను హాయిగా మురిపించి, అదిలించి, నెమ్మదించలేనని,
చందరయ్య నడిగి వెన్నెలమ్మని తేను వెళ్దామంటే,
ఉసిరి కొమ్మ వెనుక నుండి, కొబ్బరాకు పైకెక్కి,
నిక్కి నిక్కి నింగికెక్కి, నల్ల మబ్బు వెనుక నక్కి,
నన్నెక్కిరించి జారుకున్నాడెలాగిక?

చందమామను చూసి కవిత వ్రాసిన బహుమతిగా ఇచ్చిన ఉషగారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.


2, మే 2012, బుధవారం

కథగా కల్పనగా ...

                       కనిపించెను నాకొక దొరసాని 19, ఏప్రిల్ 2012, గురువారం

ఓ మేఘం చల్లగాలితో ప్రేమలో పడిందోచ్

           అది చినుకై కురిసి వసంతమై విరిసింది...6, మార్చి 2012, మంగళవారం

లలితప్రియకుసుమం

                              పిందెగా మారిన వైనం, ఎంత ఆశర్యమో కదా!


22, ఫిబ్రవరి 2012, బుధవారం

రంగు రూపు వేరైనా

                    ఎంత అందంగా ఉన్నాయో కదా! 
18, జనవరి 2012, బుధవారం

ఊరందరిదీ ఒక దారైతే

                                ఉలిపిరి కట్టది  ఒక దారట...ఇప్పుడు నేనేమన్నానని అలా వెళ్లి పోతున్నావ్ 

16, జనవరి 2012, సోమవారం

12, జనవరి 2012, గురువారం

సంక్రాంతి పండక్కి నేనొచ్చేశా

ఈ సంవత్సరం బోర్డర్ కు వేసిన బంతి మొక్కలు 

7, జనవరి 2012, శనివారం

ఓసారిలా వస్తావా....."ఏదో చెప్పాలని ఇంత దూరం తీసుకొచ్చావ్...ఏంటో చెప్పూ"
"కాస్త మెల్లిగా మాట్లాడు ఎవరో వచ్చినట్లున్నారు"

6, జనవరి 2012, శుక్రవారం

మనదీ మనమను మాటే..

....అననీయాదు తాననదోయ్..... నేను చెప్పిన మాట నమ్మకపోతే, ఆ కళ్ళలో కోపం చూడండి మీకే తెలుస్తుంది..

3, జనవరి 2012, మంగళవారం

మనసున మనసై బ్రతుకున బ్రతుకై

తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గమూ..
Dallas, Texas