26, నవంబర్ 2013, మంగళవారం

ఏందోనమ్మా ఇచిత్రవా....

                    ఆడాడ్నో తుఫానంట్నే... ఈడ జూస్తే తాగడానిగ్గూడా బొట్టు నీళ్ళు జిక్కటంలా


ఆయక్కెవురో భుజమ్మింద బిందెత్తుకునా ఇట్టనే వస్తా ఉంది. అడుగునన్నా రొన్ని నీళ్ళు౦డాయేమో! అదే౦దో కతమ్మా....అడుగు బొడుగునుండే నీళ్ళనా, పైకి రప్పీడానికి నాలుగు రాళ్ళేసినాదంట, నా మాదిరి కిలాడీ. బళ్ళో ఐవోరు పిలకాయలకు జెప్తా వుంటే ఇన్నాలే. అట్ట జేసైనా రొండు చుక్కలు గొంతులో ఏసుకుందామని ఆలోచన జేస్తా వున్ణానా, ఆ తట్టామె ఎట్టా కనిపెట్టిందో తల్లా, ఇట్నే జూస్తావుంది. 
ఆ తట్టు కొనాకి ఏ౦దో ఔపడుతా వుందే...జొన్నాడ కావాక్షమ్మ దయ దల్చినాద్తల్లె... 
సుబ్బరంగా  రొండు మునకలు గూడా యేసినా.


చీరాల బీచ్ 

29, అక్టోబర్ 2013, మంగళవారం

కారులో షికారు కెళ్ళే

దోర నగవుల అందగాడా 
నీట తడిసిన ఇసుక బాటకు ఎలా వస్తివో చెప్పగలవా 
మాపటేళ అలల చెంతకు పోదమని మన ఊసులాయే
తలచినంతనే కలల తీరపు దారి ఏలా తెలిసెనో 
కారులో షికారు కెళ్ళే దోర నగవుల అందగాడా 
నీట తడిసిన ఇసుక బాటకు ఎలా వస్తివో చెప్పగలవా

Pismo Beach, CA

8, అక్టోబర్ 2013, మంగళవారం

చూపు సోకినంతనే

ఎదను దాగిన కలలేవో  
తలపుల ఒరవడిలో ఓలలాడెనేలనో!2, అక్టోబర్ 2013, బుధవారం

ఈనాటి ఈ బంధమేనాటిదో...


 

     కోటయ్య తోట

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఇదిగో ఏమోయ్ నిన్నే...

ఐదు గంటలకే బీచ్ దగ్గరుంటానన్న విషయం నేనే౦ మరచిపోలేదు ఏదో కొంచెం పనుండి...


          ఆలస్య౦గా వచ్చానని ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతుంది. మీరైనా కొంచెం చెప్పండి. 


చీరాల 

9, సెప్టెంబర్ 2013, సోమవారం

నైరాశ్యపు లోగిలిలో

మనుగడ సాగించలేక మరలి పోతావనుకున్నాను 
 కుసుమించిన సుమాన్ని గాంచి సంభ్రమాశ్చర్యాలతో మురిసిపోతున్నాను!


Myrtle Beach, NC

18, జులై 2013, గురువారం

9, మే 2013, గురువారం

మీరేమన్నారేమిటి?

                                  ఇలా తెల్ల మొహం వేసింది.


అజేలియా 

22, ఏప్రిల్ 2013, సోమవారం

నే చెపితే విన్నావా..

                నిన్ను చూసి ఆ చెర్రీ బ్లాజం చూడు ఎలా పగలబడి నవ్వుతోందో! ఇకనైనా కొంచెం మాయిశ్చరైజర్ రాసుకో.22, మార్చి 2013, శుక్రవారం

ఆశావాదం
బీటలు వారిన నేలపై
స్వాతి చినుకుల సంబరం!

మోడువారిన మానుపై
చివురాకుల కలకలం!

నునులేత పసిమొగ్గ
వికసిసించే సోయగం! 

ఒ౦టరియైన నింగికి 
నెలవంక స్నేహితం!

ముసురేసిన మబ్బును దాటి
దూసుకు వస్తున్న రవికిరణం!

భారమైన బ్రతుకునకు
ఆలంబన ఆశావాదం!! 

19, ఫిబ్రవరి 2013, మంగళవారం

నిన్నలేని అందమేదో

                     నిదురలేచెనెందుకో.... ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచటదాగెనో2/16/13 

8, ఫిబ్రవరి 2013, శుక్రవారం

నా తోడు నీవై ఉంటే నీ నీడ నేనే నంటి

ఈ జంట కంటే వేరే లేదు లేదంటి 

6, జనవరి 2013, ఆదివారం

జ్వలిస్తున్న సుమం

"ఇంకెంత కాలం ఈ అరాచకాలంటూ"
 ఉవ్వెత్తున ఎగసి ఆగ్రహావేశాలతో కన్నెర్ర జేసిన తరుణం