26, సెప్టెంబర్ 2012, బుధవారం

అందమైన జీవితం

ముడుచుకున్న మొగ్గపై
చినుకుల చిరునగవులు చిందితే
ముసిముసి నవ్వుల పువ్వై విరిసింది!

నేడు కాసిని తుళ్ళింతల తరుణాలు ప్రోగుచేస్తే
రేపంతా ఇక పరిమళ భరితమే సుమా!


18, సెప్టెంబర్ 2012, మంగళవారం

ఔరా!

దాగని సిగ్గు మోముపై సింగారం ఒలికిస్తోంది, ఏ కన్నియ కలను దోచేశాయో!