22, మార్చి 2013, శుక్రవారం

ఆశావాదం
బీటలు వారిన నేలపై
స్వాతి చినుకుల సంబరం!

మోడువారిన మానుపై
చివురాకుల కలకలం!

నునులేత పసిమొగ్గ
వికసిసించే సోయగం! 

ఒ౦టరియైన నింగికి 
నెలవంక స్నేహితం!

ముసురేసిన మబ్బును దాటి
దూసుకు వస్తున్న రవికిరణం!

భారమైన బ్రతుకునకు
ఆలంబన ఆశావాదం!!