23, మే 2012, బుధవారం

చినుకుల సవ్వడిలో

               

నీలి మేఘం మెరుపుతీగతో సయ్యాటలాడే సమయాన
నా తలపులు నీ చెంతకు చేరి 
వలపుల జిలుగులు రువ్వుతున్నాయి చూడు!

11, మే 2012, శుక్రవారం

అందరాని చందమామ నాకె౦దుకూ

                                        వెన్నెల్లా౦టి ఈ పువ్వు చాలు నాకు 


6, మే 2012, ఆదివారం

ఆకాశవీధిలో అందాలజాబిలి


రఘునాధ్

గుండె కతలన్నీ గుట్టుగా, గుసగుసగా చెప్పలేనని,
కలంనడిగి నీలి అక్షరాలు తెచ్చా.
చిర్నవ్వు రేకులన్నీ నీపై చల్లలేనని, చిరుగాలి తెరలుతెచ్చా.
నిన్ను హాయిగా మురిపించి, అదిలించి, నెమ్మదించలేనని,
చందరయ్య నడిగి వెన్నెలమ్మని తేను వెళ్దామంటే,
ఉసిరి కొమ్మ వెనుక నుండి, కొబ్బరాకు పైకెక్కి,
నిక్కి నిక్కి నింగికెక్కి, నల్ల మబ్బు వెనుక నక్కి,
నన్నెక్కిరించి జారుకున్నాడెలాగిక?

చందమామను చూసి కవిత వ్రాసిన బహుమతిగా ఇచ్చిన ఉషగారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.


2, మే 2012, బుధవారం

కథగా కల్పనగా ...

                       కనిపించెను నాకొక దొరసాని