22, మార్చి 2013, శుక్రవారం

ఆశావాదం








బీటలు వారిన నేలపై
స్వాతి చినుకుల సంబరం!

మోడువారిన మానుపై
చివురాకుల కలకలం!

నునులేత పసిమొగ్గ
వికసిసించే సోయగం! 

ఒ౦టరియైన నింగికి 
నెలవంక స్నేహితం!

ముసురేసిన మబ్బును దాటి
దూసుకు వస్తున్న రవికిరణం!

భారమైన బ్రతుకునకు
ఆలంబన ఆశావాదం!! 

16 కామెంట్‌లు:

  1. "మోడువారిన మానుపై
    చివురాకుల కలకలం!
    భారమైన బ్రతుకునకు
    ఆలంబన ఆశావాదం!!"

    వహ్వా ఏమి చెప్పారండి...

    నా దృష్టిలో పండ్లల్లో మామిడి రాజు అయితే ఋతువుల్లో వసంతఋతువు రారాజు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హై హై నాయక గారు నిజమేనండి. నాకు అమెరికాలో ముఖ్యంగా తూర్పు వైపు, శిశిరం కూడా చాలా నచ్చుతుంది. థాంక్యు

      తొలగించండి
  2. ఫోటో సూపర్ గా ఉందండీ...
    కవిత కూడా ;)

    రిప్లయితొలగించండి
  3. కవిత బాగుందో, చిత్రం బాగుందో decide చేయలేకపోతున్నా?

    రిప్లయితొలగించండి
  4. కవిత బాగుందో, చిత్రం బాగుందో decide చేయలేకపోతున్నా?

    రిప్లయితొలగించండి
  5. చాలా చాలా బాగున్నాయికవిత ,ఫోటో రెండూ

    రిప్లయితొలగించండి
  6. ఫొటో అద్బుతం..మీ కవిత ఫొటోను మరింత అద్భుతం చేసింది.
    కోలా హరిబాబు
    h.kola4@gmail.com
    kolahari.wordpress.com

    రిప్లయితొలగించండి