అవీ ఇవీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవీ ఇవీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, అక్టోబర్ 2015, సోమవారం

నే చెపితే విన్నావా...

                 "పిల్లాడికి తెలుగు ఎందుకూ నేర్పించడం" అని అఘోరించావ్.  ఇప్పుడు చూడు యావయ్యిందో... వాడితో పాటు మనల్ని కూడా గాడిదల్ని చేసేశాడు. "అయనా తెలుగు వాళ్ళు జపనీస్ ఎందుకు నేర్చుకోవాలి? రష్యన్ ఎందుకు నేర్చుకోవాలి, అని ఆలోచించాలి గాని తెలుగెందుకు నేర్చుకోవాలీ, అని ఆలోచిస్తారటరా?  పిదప కాలం పిదప బుద్దులూనూ....      



       "వాడి నోట్లోంచి 'ఓలా', 'అమీగోస్' అంటూ నాలుగు స్పానిష్ ముక్కలు రాలగానే మురిసి ముక్కలయ్యావ్, వొక్క తెలుగు మాట రావడం లేదేమిరా అని ఏనాడైనా ఆలోచించావట్రా. పైగా తెలుగెందుకు పనికొస్తుందీ అని వితండవాదం వొహటీ. చరిత్రని లెక్కల్లో కొలుస్తావట్రా... నీ కాలు చెయ్యీ ఆడని రోజున నీ కొడుకు నీలాగేగా ఆలోచిస్తాడు."  

     మేం పడ్డ యాతన మీరు పడకూడదంటే ఓ నాలుగు భాషలన్నా నేర్చుకుని తగలడండి. రేపు వాడు ఎవత్తిని కట్టుకునొస్తే ఆ భాషేగా మీ మనవడు మట్టాడేదీ. ఐదో భాష నేర్చుకోవడం తేలికౌతుంది. 

6, మే 2014, మంగళవారం

నాకు ఓటెయ్యరూ...

                                               నేనేంటో, సమాజం కోసం ఏమి చేశానో మీకు తెలుసు. మీ ప్రతినిధిగా నిలబడే అర్హత ఉందనుకుంటే నాకు ఓటెయ్యండి.



ఓసి పిచ్చి మొహమా! అలా నిజాయితీగా అడిగితే ఎవరూ ఓటెయ్యరు. నాలా మొహానికి కాస్త రంగు   పూసుకుని, ఇలా సారాయిలో జలకాలాడించు.   


నువ్వేం చేశావో, ఏం చెయ్యగలవో తెలుసుకోవడానికి ఎవరికి తీరికుందే! ఇలా విచ్చలవిడిగా వాగ్దానాలు చెయ్యి. 




కట్టలు కట్టలు డబ్బులు పంచు. ఫరవాలేదులే.. మళ్ళీ  ఇంతకు పదింతలు సంపాదించుకోవచ్చు. 






ఇలా మందను తీసుకురా. అందులో బాగా పలుకుబడి కలిగిన వివిధ వర్గాల వాళ్ళుండేలా చూసుకో. వాళ్ళ మద్దతుతో వాళ్ళ ఓట్లన్నీ నీకే.
ఇక గెలవడం ఖాయం. 






అమ్మో! ఇన్ని సలహాలిచ్చేస్తున్నాం, ఇంతకీ నీదే కులం....



20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఇదిగో ఏమోయ్ నిన్నే...

ఐదు గంటలకే బీచ్ దగ్గరుంటానన్న విషయం నేనే౦ మరచిపోలేదు ఏదో కొంచెం పనుండి...


          ఆలస్య౦గా వచ్చానని ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపంగా వెళ్ళిపోతుంది. మీరైనా కొంచెం చెప్పండి. 


చీరాల