26, నవంబర్ 2013, మంగళవారం

ఏందోనమ్మా ఇచిత్రవా....

                    ఆడాడ్నో తుఫానంట్నే... ఈడ జూస్తే తాగడానిగ్గూడా బొట్టు నీళ్ళు జిక్కటంలా


ఆయక్కెవురో భుజమ్మింద బిందెత్తుకునా ఇట్టనే వస్తా ఉంది. అడుగునన్నా రొన్ని నీళ్ళు౦డాయేమో! అదే౦దో కతమ్మా....అడుగు బొడుగునుండే నీళ్ళనా, పైకి రప్పీడానికి నాలుగు రాళ్ళేసినాదంట, నా మాదిరి కిలాడీ. బళ్ళో ఐవోరు పిలకాయలకు జెప్తా వుంటే ఇన్నాలే. అట్ట జేసైనా రొండు చుక్కలు గొంతులో ఏసుకుందామని ఆలోచన జేస్తా వున్ణానా, ఆ తట్టామె ఎట్టా కనిపెట్టిందో తల్లా, ఇట్నే జూస్తావుంది. 




ఆ తట్టు కొనాకి ఏ౦దో ఔపడుతా వుందే...



జొన్నాడ కావాక్షమ్మ దయ దల్చినాద్తల్లె... 
సుబ్బరంగా  రొండు మునకలు గూడా యేసినా.


చీరాల బీచ్